Friday, March 20, 2026

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ కుత్బుల్లాపూర్ నవంబర్ 29:

(నేటి సాక్షి)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవము నిర్వహించామని కాలని ప్రెసిడెంట్ ముత్యపాగ నర్సింగ్ రావ్ తెలిపారు, ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్,గాజులరామారం రెవెన్యూ ఇనస్పెక్టర్, జి ఎచ్ ఏం సి అధికారులు, ఎచ్.ఏం. డబ్ల్యూ. ఎస్. ఎస్. జనరల్ మేనేజర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల హక్కుల గురించి పౌర సేవల గురించి ప్రజలకు వివరించారు,ప్రజలు వివిధ సమస్యల పై అధికారులకు వినతి పత్రం ఇచ్చారు, తహసీల్దార్ అశోక్ కుమార్ ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారం అయ్యేల చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ దళిత సంఘాల మాజీ అధ్యక్షుడు జేమ్స్, ప్రేమ్ కుమార్, బుచ్చయ్య,ముత్యపాగ నర్సింగ్ రావ్, కో గోపాల్,పాండు, మేకల సత్యనారాయణ, మాజీ హెడ్ మాస్టర్ పుండరికం,మహిళ నాయకులు రాణి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News