నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)రామాపురం వద్ద ఉన్న చెత్త నిర్వహణ డంపింగ్ యార్దును స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్ శనివారం సాయంత్రం అధికారులతో కలసి పరిశీలించారు. చెత్త నిర్వహణ ఎలా చేస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? తదితర వాటిని పరిశీలించారు. గడువు లోపు చెత్త నిర్వహణ పూర్తి చేయాలని, రికార్డులు పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.చైర్మన్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.రమణ, తదితరులు ఉన్నారు.





