నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 29,నారాయణపేట ఆర్టీసి డిపో నుంచి ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పరచాలని లేకపోతే బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని బిజెపి నాయకులు రఘువీర్ యాదవ్,మిర్చి వెంకటయ్య,శీల చంద్రశేఖర్ రెడ్డి, సత్య రఘుపాల్, సై దప్ప హెచ్చరించారు.శనివారం సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ డిపో మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పుణ్య క్షేత్రాలకు నడిపే బస్సులు ఇలా ప్రారంభిస్తారు అలా రద్దు చేస్తారని విమర్శించారు. కర్ణాటక బస్సులు నడుస్తుండ దంతో తెలంగాణ ఆదాయం కొల్లగొడుతున్నారని అన్నారు.అయినా ఆర్టీసి అధికారులకు పట్టడంలేదని అన్నారు.ప్రజల సౌకర్యం కోసం ఆదాయం కోసం ఇంటర్ స్టేట్ పర్మిట్ తీసుకుని సైదాపూర్, యాడగిర్, రై చూర్,సెడం,గుల్బర్గా ప్రాంతాలకు బస్సులు నడపాలని కోరారు.అలాగే ప్రతి బస్టాండ్ అపరి శుభ్రంగా ఉన్నాయని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.లేకపోతే డిపో ముందు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.





