Friday, March 20, 2026

*గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి** ఎన్నికల ప్రక్రియ పై అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి* జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆద్వర్యంలో ఆర్వోలకు, ఏఆర్వోలకు ఫేజ్ -3 శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని వీడియో పవర్ ప్రెజెంటేషన్ ద్వారా అవగహన కల్పిస్తూ ఎన్నికల విధుల పట్ల దిశానిర్దేశం చేశారు.*నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలంటే మనకు నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన అంశమని, దీని పైన చాలా కేసులు దాఖలు అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని తెలిపారు. అధికారిక ప్రకారం మాత్రమే రిజర్వేషన్ అంశాలను పరిశీలించాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. *అనుమతుల కోసం..తాహశీల్దరులను సంప్రదించాలి*ఎన్నికల్లో పోటీచేయు అభ్యర్థులకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రాలు, ప్రచార వాహనాల అనుమతులను తీసుకోవాలంటే సంబంధిత మండల తహసిల్దార్లను సంప్రదించాలని తెలిపారు. గ్రామాలలో ఎక్కడైనా సర్పంచ్ అభ్యర్థికి 8, వార్డు సభ్యులకు 6 కంటే ఎక్కువ నామినేషన్ దాఖలు ఐతే తమకు తెలియజేయాలని అన్నారు. అభ్యర్థుల యొక్క అన్ని వివరాలు నామినేషన్ పత్రాలలో పూర్తిగా నమోదు చేయాలని, లేనిచో అట్టి నామినేషన్ ను తిరస్కరించాలని సూచించారు. ప్రతి చిన్న అంశాన్ని,అనుమానాలను శిక్షణ లో పూర్తి స్థాయిలో విచారించి తెలుసుకోవాలని సూచించారు. ట్రైనింగ్ హల్ నుంచి పూర్తి అవగాహనతో బయటకు వెళ్లాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమవాళికి లోబడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించుటకు అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ కు ఒకరోజు ముందుగా కొత్త బ్యాంక్ ఖాతా తీసుకునే విధంగా వారికి తెలియజేయాలని సూచించారు.ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ఒరిజినల్ పత్రాలను సంబంధిత గ్రామ పంచాయతీలలోని ఆర్వో ల వద్ద పొందవచ్చని తెలిపారు. Xerox కాపీ లు వాడవద్దని, వార్డు సభ్యుడు పోటీ కోసం అదే వార్డు సభ్యుడు ప్రొపోజర్ గా ఉండాలి. సర్పంచ్ గా పోటీచేసే అభ్యర్థి డిపాజిట్ క్రింద కేటగిరి వారిగా చెల్లించాలని, ఏమైనా అప్పీల్ ఉంటే RDO ను సంప్రదించాలని సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసుధన్, జిల్లా వ్యయ పరిశీలకులు జనరల్ అబ్జర్వర్ జి. రమేష్,డి ఈ వో రాము, మదన్ మోహన్, రేవంత్, డి వై ఎస్ వో రవి, జిల్లా నోడల్ అధికారులు, జిల్లా ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు._________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News