నేటి సాక్షి 29 అమరావతి:- జుపాడు బంగ్లా మండలం తంగడంచ ఫారం 1600 ఎకరాల ప్రభుత్వ భూములను అభివృద్ధి చేయాలని, మీ చేతుల మీదుగా ప్రారంభించిన జైన్ పరిశ్రమ, మెగాసిడ్ పార్కును అభివృద్ధి చేయాలని ఇక నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ శనివారం టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్ఎస్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు వినతి పత్రం అందించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి తంగడంచ ఫారం భూములను నమ్ముకుని దాదాపు 12 గ్రామాల ప్రజలు ఉపాధి కోసం యువత ఎదురు చూస్తున్నారని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీరు మెగాసిడ్ పార్క్,జైన్ పరిశ్రమను ప్రారంభించారని అయితే అభివృద్ధికి నోచుకోక ఆ భూముల అడవిని తలపిస్తున్నాయని భూములు అభివృద్ధికై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కొనసాగించినప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.. ఈ భూములు అభివృద్ధి చేస్తే నందికొట్కూరు నియోజకవర్గం లో నిరుద్యోగ సమస్య పూర్తిగా తీరుతుందని ఆ వైపున కృషి చేయాలని వారు కోరారు.. గతంలో యువ గళం పాదయాత్రలో నారా లోకేష్ గారు జైన్ పరిశ్రమను సందర్శించి అధికారంలోకి వస్తే పరిశ్రమను ప్రారంభించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని వారు అన్నారు.. తక్షణమే ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు ఈ భూముల అభివృద్ధికి నాంది పలికి నిరుద్యోగ యువతీ యువకులకు రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు వినతి పత్రం అందించారు..





