నేటిసాక్షి, రాయికల్ : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం సింగరావుపేట గ్రామానికి చెందిన బత్తుల కాశీరాం అలీయాస్ ప్రతాప్ అలీయాస్ సమర్ మహరాష్ట్ర గోండియా జిల్లాలో పోలీసుల ఎదుట సహచర మవోయిస్టులతో కలిసి లొంగిపోయారు. 36 ఏళ్లక్రితం గ్రామంలో హోంగార్డుతో జరిగిన గొడవ వల్ల పోలీసులు ఇంటికి రావడంతో కేసు నమోదు అవుతుందనే భయంతో భార్య మల్లవ్వతో సహ అడవి బాట పట్టిన కాశీరాం ఉద్యమానికి సెలవు ప్రకటించారు. దళసభ్యడి నుండి డివిసిఎంగా ఎదిగి పని చేస్తున్నారు. గ్రామానికి చెందిన బత్తుల పెద్దరాజయ్య, గంగవ్వ దంపతులకు నలుగురు సంతానం కాగ పెద్దవాడైన కాశీరాం పెండ్లై ఇరువురు కుమారులు ఉండగా వారిని బంధువులకు అప్పగించి ఉద్యమ బాట పట్టడం అప్పట్లో సంచలనమైంది. అడవి బాట పట్టిన కాశీరాం ఇప్పటివరకు ఇంటి ముఖం చూడలేదని కుటుంబసభ్యులు చెప్పారు. భార్యభర్తల లొంగుబాటు కోసం పోలీసులు, బంధువులు ఎంత ప్రయత్నించిన సఫలం కాలేదు. అపరేషన్ కాగర్తో ఉద్యమం అంతిమ దశకు చేరుకున్న నేపథ్యంలో కాశీరాం తన సహచర దళసభ్యులతో ఈనెల 28న మహరాష్ట్రలో లొంగిపోయారు. గతంలోనే కాశీరాం భార్య ఆనారోగ్యంతో మృతి చెందారు. కాశీరాం లొంగిపోయినట్లు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో పలువురు కుటుంబసభ్యులు మహరాష్ట్రకు తరలివెళ్లారు. చాలా కాలం తర్వాత కాశీరాంను చూసిన కుటుంభీకులు, బంధువులు చెమ్మగిల్లిన కళ్లతో ఆనందం వ్యక్తం చేసారు.ఫోటో రైటప్: 29RKL01: లొంగిపోయిన మవోయిస్టు కాశీరాం 29RKL01A: సింగరావుపేటలోని కాశీరాం ఇల్లు





