నేటి సాక్షి,బాపట్ల జిల్లా (పర్చూరు)నాగార్జునసాగర్ ప్రాజెక్టు చివరి భూములకు సాగునీరు అందించి రైతులకు భరోసానివ్వాలన్న లక్ష్యంతో కాలువల ఆధునికరణకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ చక్రపాణి, డీఈ స్వామినాయక్ వెల్లడించారు. శనివారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంప్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, నీటి సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్న సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన అన్నారు. *“ప్రతి చేనుకూ నీరు—అదే మా లక్ష్యం”:చక్రపాణి* రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా నీటి సరఫరా కొనసాగేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.ప్రతి చేనుకు నీరు అందించాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే ఏలూరి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు.కాలువల నిర్వహణ, నీటి పారుదల వ్యవస్థ బలోపేతానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు.*రూ.6.50 కోట్లతో 70 పనులకు ప్రతిపాదనలు** యన్ యస్ పి డీఈ స్వామి నాయక్జంగిల్ క్లియరెన్స్, కట్టల పునరుద్ధరణ, కాలువల మరమ్మత్తులు వంటి 70 పనులకు రూ.6.50 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి నివేదికలు పంపించినట్లు తెలిపారు.నీటి సంఘాల నాయకులు సూచించిన మరిన్ని పనులను కూడా ప్రతిపాదనల్లో చేర్చుతామని చెప్పారు.వేసవికాలంలో పనులు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు.*“2014–19లో అడుగడుగునా అభివృద్ధి… 2019–24లో నిర్లక్ష్యం”** పర్చూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు2014–19 మధ్య ఎమ్మెల్యే ఏలూరి కృషితో నాగార్జునసాగర్ కాలువలన్నీపునరుద్ధరించబడ్డాయని గుర్తుచేశారు.2019–24 వైసీపీ ప్రభుత్వ కాలంలో కాలువలపై ఎలాంటి శ్రద్ధ చూపకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.కూటమి ప్రభుత్వం వస్తూనే నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టినట్లు వివరించారు.మొంథా తుఫాన్ వల్ల ఏర్పడిన గండ్లను తాత్కాలికంగా పూడ్చిన తర్వాత, ఇప్పుడు కోనంకి సబ్‌డివిజన్‌లోని నాలుగు సెక్షన్లకు సంబంధించిన పూర్తి స్థాయి మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మార్టూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాటినాగేశ్వరరావు,కమిటీచైర్మన్లుఆంజనేయస్వామి,బండ్ల శ్రీనివాసరావు,మల్లికార్జునరావు,కోసరాజు దిలీప్,కొల్లా మురళీకృష్ణ,మువ్వ ఆంజనేయులు,మహబూబ్ ఖాన్‌తోపాటు నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.





