నేటి సాక్షి,బాపట్ల జిల్లా (బాపట్ల రూరల్)రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జిల్లా కేంద్రమైన బాపట్ల ప్రొడిజి విద్యాలయ విద్యార్ధి ఎన్ కౌషిక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్థానం కైవసం చేసుకుని వెండి పతకం సాధించాడని ప్రొడిజి విద్యా లయ ప్రిన్సిపాల్ బ్రజేష్ కానూన్ గో తెలిపారు. బాపట్ల జిల్లా లోని జే పంగులూరు చందలూరు గ్రామంలో జరిగిన 69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో అండర్ 14 విభాగంలో కౌషిక్ పాల్గొని రెండవ స్థానం సాధించి వెండి పతకం కైవసం చేసుకున్నాడన్నారు ప్రొడిజి విద్యాలయ ప్రాంగణం లో కౌషిక్ కు ప్రిన్సిపాల్ బ్రజేష్ కానూన్ గో శనివారం అభినందన సభ ఏర్పాటు చేసి అభినందించారు. రాబోయే రోజుల్లో కౌషిక్ జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించాలని కరెస్పాండెంట్ మాచాబత్తిని శ్రీనివాస రావు అన్నారు డైరెక్టర్స్ శ్రీనివాసరావు పార్థసారథి ఉదయ చంద్ర రావు వ్యాయామ ఉపాధ్యాయులు రత్నకుమార్ పద్మజ బాబూరావు సునీల్ వరలక్ష్మి మౌనిక నీలిమలు కౌషిక్ ను అభినందించారు.




