Saturday, March 21, 2026

*బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర సహకార కార్పోరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి..*

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ఉమ్మడి మానాల, దేగవత్ తండాకు చెందిన మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని రాష్ట్ర సహకార కార్పోరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. దేగవత్ తాండకు చెందిన దేగవత్ తిరుపతి తండ్రి మాజీ ఉప సర్పంచ్ పరశురాం నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. శనివారం తిరుపతి ఇంటికి వెళ్లిన రాష్ట్ర సహకార కార్పోరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూం జలపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు జుల దిలీప్, జక్కుల లక్ష్మీ నర్సయ్య, జక్కు మోహన్, జక్కు వంశీ, అంబర్ సింగ్ నాయక్, జక్కు చిన్న లింగారెడ్డి, గంగాధర్ నాయక్, బంకట్ లాల్ నాయక్, గురుదాస్ నాయక్ తండా వాసులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News