Saturday, March 21, 2026

*విద్యార్థుల ప్రతిభకు తార్కాణం సైన్స్ ఫెయిర్*

నేటి సాక్షి (జిన్నారం) బొల్లారం మున్సిపాలిటీ శ్రీ వాగ్దేవి హై స్కూల్ లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమం సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించేందుకు సైన్స్ ఫైయిర్ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని ఉదయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. శ్రీ వాగ్దేవి హై స్కూల్ లో విద్యార్థులు అనేక విభాగాల్లో తయారు చేసిన వివిధ రకాల నమూనాలను పరిశీలించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల నమూనాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోరియస్ పాఠశాల నిర్వాహకులు జి. సింహాచలం మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయుల సహకారంతో ఇలాంటి వైజ్ఞానిక విషయాలు తెలుసుకుని వాటిని గురించి వివరించడం అభినందించదగ్గ విషయం అని అన్నారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకత వెలికితీయడం సైన్స్ ఫెయిర్ ఉద్దేశం అని ఆయన తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన నమూనాలను వారి వారి తల్లిదండ్రులు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులతో ఏర్పాటు చేసిన అంగడి విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి. కృష్ణ కిషోర్, ఇంఛార్జి గిరిజ, ఉపాధ్యాయుల బృందం దత్తాత్రేయ, శైలజ, చందనా కుమారి, అనూష, రాజ్యలక్ష్మి, గిరిజ, రాణి, అనూష, ఫూల్ కుమారి, సహాయకులు లావణ్య, రూప తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News