నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 1, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని రాకొండ గ్రామానికి చెందిన పెద్దపుల్లన్న గ్రామ సర్పంచ్ కోసం నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మరికల్ మండల పరిధిలోని మాదారం క్లస్టర్ పరిధిలో గ్రామ సర్పంచ్ కోసం నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసే సమయంలో రాకుండా గ్రామ సర్పంచ్ నామినేషన్ వేసేందుకు బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున టిఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు గాదం మల్లేష్ జి రాజు,బాలరాజు, పవన్, రాము, చెన్నప్ప, జి రాములు, నీలప్ప, వాకిటి రాజు, ఎస్ అంజి, రాములు నరహరి, రమేష్, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





