Saturday, March 21, 2026

*డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*వెదురు కుప్పం*డాక్టర్ వైయస్సార్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ అవగాహన సదస్సును నిర్వహించడమైనది. 2025 ఎయిడ్స్ అవగాహన సదస్సు ఎయిడ్స్ రోగుల ఆదరణ మరియు వారి ఫండ్స్ కి ఉండే ప్రతిబంధకాలను నిర్మూలనా విధానాలకు సంబంధించి రూపొందించడం అయినది. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.లక్ష్మీ ప్రసన్న లత ఎయిడ్స్ కారకాలు మరియు వాటి నివారణా చర్యలను క్షుణ్ణంగా వివరించారు. విద్యార్థులందరూ ఎయిడ్స్ అవగాహన కలిగి ఉండాలని ఎయిడ్స్కు గురైన వారి పట్ల దయార్థ హృదయంతో మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్, వైఆర్ సి యూనిట్, ఆర్ఆర్సి యూనిట్,డి ఆర్ సి యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించడం అయినది. కార్యక్రమం తదుపరి విద్యార్థులు మరియు అధ్యాపకులు సమూహంతో ర్యాలీ నిర్వహించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News