( నేటి సాక్షి)జర్నలిస్టుల హక్కుల సాధన కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ మామిడి సోమయ్య పిలుపుతో సోమవారం హైదరాబాద్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్దఎత్తున జర్నలిస్టులు చేరి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.- కొత్త అక్రిడేషన్లు జారీ చేయాలని డిమాండ్ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రాథమిక అవసరాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా కొత్త అక్రిడేషన్ల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో మీడియా ప్రతినిధులు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.- ఆరోగ్య భీమా పునరుద్ధరణ – ఇళ్ల స్థలాలు కోరిన జర్నలిస్టులుజర్నలిస్టులకు ఆరోగ్య భీమా విధానాన్ని తక్షణం పునరుద్ధరించాలని, మీడియా వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నేతలు డిమాండ్ చేశారు.- చిన్న మధ్యతరహా పత్రికలకు రక్షణ చర్యలు అవసరంసంక్షోభంలో ఉన్న చిన్న, మధ్యతరహా పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలని, పత్రికలకు ఇవ్వాల్సిన అడ్వర్టైజ్మెంట్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అధికారులు ముందు ఉంచారు.జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం అత్యంత గంభీరంగా పరిగణించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని టిడబ్ల్యూజెఎఫ్ నేతలు స్పష్టం చేశారు.





