Saturday, March 21, 2026

అంబేద్కర్ అడుగుజాడల్లో ఆశయాలతో ముందుకు వెళ్తున్న వేల్పుల ఆనంద్ కుమార్ :— సామాజిక వేత్త డాక్టర్ నాగన్న..

నేటి సాక్షి 01నందికొట్కూరు :—-వేల్పుల ఆనంద్ కుమార్కు నేటి యువతీ, యువకులు ఆదర్శంగా తీసుకొని ఆశయం వైపు అడుగులు వేయాలని సామాజిక వేత్త డాక్టర్ నాగన్న అన్నారు. వెలుగోడు వాస్తవ్యులు ఐఆర్ఎస్ వేల్పు ఆనంద్ కుమార్ పదోన్నతి సందర్భంగా నందికొట్కూరులో ఆత్మీయ అభినందన సభను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లె, పాములపాడు, వెలుగోడు, జూపాడుబంగ్లా, నందికొట్కూరు పరిసర ప్రాంతాల గ్రామాల నుండి దాదాపుగా 100 కార్లతో కాన్వాయ్ తో బీసీ సంఘం నేత గట్టు శంకర్ గౌడ్, ఎల్లగౌడ్ వేల్పుల జయపాల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరులోని మార్కెట్ యార్డ్ నుండి బస్టాండ్ మీద మేళతాలలతో స్థానిక నంద్యాల టర్నింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆనంద్ కుమార్, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి సిఎస్ఐ చర్చి దగ్గర ఏర్పాటు చేసిన ఆత్మీయఅభినందన సభకు చేరుకున్నారు. అభినందన సభకు ప్రముఖులు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ నాగన్న ఆత్మీయ అభినందన సభలో ఏర్పాటు చేసిన జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేల్పుల ఆనంద్ కుమార్ చిన్ననాటి నుండి చదువులో చురుకుగా అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ, అంబేద్కర్ ఆశయాలతో కూడిన వ్యక్తి ఈ వేల్పుల ఆనంద్ కుమార్ అని పొగిడారు అంతేకాకుండా ఎన్నో ఎన్నెన్నో ప్రజలకు కేవలం సేవ చేయాలి, అనే సేవా దృక్పథంతో ఆయన నందికొట్కూరు ప్రజలకు నిరంతరం సేవ చేయాలి అనే తపనతో కొన్ని ముఖ్య కార్యక్రమాలు చేపట్టి విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఈ ఐ ఆర్ ఎస్ ప్రమోషన్ తో ఆయనకు ఇంకా ఉద్యోగ రీత్యా మరిన్ని బాధ్యతలు పెరగడం ఒక దళిత బిడ్డ ఇండియా రెవెన్యూ సర్వీసెస్ సెంట్రల్ జాబ్ రావడం అదృష్టంగా భావించాలి.ఇంత గొప్ప మహనీయుడిని కన్నా తల్లి తండ్రులకు కృతజ్ఞతలు,తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకొని మన దేశప్రజలకు మన నందికొట్కూరు ప్రజలకు మంచి చేయాలని మనసారా ఆశిస్తున్నాను అని వేల్పుల ఆనంద్ కుమార్ పొగిడారు.ఉన్నత లక్ష్యం వైపు అడుగు వేసి ఉన్నత స్థానమైన ఐఆర్ఎస్ చేరుకున్నారన్నారు. భారత దేశంలో అత్యంత పదవులలో ఇది కీలకమైనది అన్నారు. ఎంతటి వారైనా సరే విద్య ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని వేల్పుల ఆనంద్ నిరూపించారని గుర్తు చేశారు. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే వంటి మహోన్నతుల ఆదర్శాలను కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. పలువురు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాల వైపు అడుగులు వేయాలని సూచించారు. అనంతరం ఐఆర్ఎస్ వేల్పుల ఆనంద్ కుమార్.ర్యాలీ నిర్వహిస్తున్న ఆత్మీయులు, స్నేహితులుజ్యోలిప్రజ్వలన చేస్తున్న వేల్పుల దంపతులు బంధువులు ఆత్మీయులు స్నేహితులు అంబేద్కర్ పూలేవాదులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్వామిదాస్, డక్కా.శ్రీకాంత్ గట్టు శంకర్,రవికుమార్, పీడీ నాగేంద్ర, కలబండి అంకన్న, డాక్టర్ వెంకటేష్, ఆర్ఎస్ గోపాల్, సుధాకర్, వినోద్ కుమార్, నల్లమల అబ్రహం, ఓబన్న గౌడ్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన స్నేహితులు, ఆత్మీయులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News