నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలించడం సాధ్యమవుతుందని విద్యార్థి దశ నుండే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు పట్ల వివక్షత చూపించకూడదని బాపట్ల జిల్లా రెవిన్యూ ఆఫీసర్ గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ ఎయిడ్స్ దినం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ బాపట్ల జిల్లా వైద్యారోగ్య శాఖ, బాపట్ల జిల్లా లెప్రసీ, టి బి, మరియు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సమీకృత వ్యూహం దిశ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో ముందుగా నర్సింగ్ కళాశాల అగ్రికల్చరల్ కాలేజీ విద్యార్థినిలతో ఆశా ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ స్వచ్ఛంద సంస్థల మహిళలతో నగరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి అవగాహన ర్యాలీని ముందుగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కే విజయమ్మ ప్రారంభించినారు.ఈ ర్యాలీ బాపట్ల పాత బస్టాండ్ సెంటర్ వరకు చేరుకుని అక్కడ మానవహారం ఏర్పాటు చేసి తదనంతరం స్థానిక అంబేద్కర్ భవనంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే విజయమ్మ మాట్లాడుతూ హెచ్ఐవి బాధితులు కొరకు ప్రభుత్వ వైద్యశాలలో వారికి అందిస్తున్నటువంటి ఐసీటీసీ, ఏఆర్టి సేవలు గురించి క్షేత్రస్థాయి వరకు ప్రతి హెచ్ఐవి బాధితులకు తెలియజేయాలని హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడుకున్నట్లయితే వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని, హెచ్ఐవి భాధిత కుటుంబాలకు, ప్రతి ప్రభుత్వ పథకం చేరువ అయ్యే విధంగా చూడాలని, హెచ్ఐవి భాధిత గర్భిణీ స్త్రీలు, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు రక్త పరీక్షలు చేయించుకుంటూ, పుట్టబోయే బిడ్డకు వ్యాధి సోకకుండా ఉండే విధంగా వైద్యులు సూచనలు సలహాలు తీసుకుంటూ ఉంటూ ఉంటే హెచ్ఐవి పుట్టే బిడ్డకు సోకకుండా ఉంటుందని, పేర్కొన్నారు.బాపట్ల జిల్లా లెప్రసీ టి. బి మరియు ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ వి సోమల నాయక్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో ఎయిడ్స్ బాధితుల సంఖ్యలో రెండో స్థానంలో ఉందని అదేవిధంగా రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని ఇది చాలా బాధాకరమైన విషయం అని దీని సమూలంగా నిర్మూలించాలంటే యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సురక్షితమైన లైంగిక అలవాట్లు కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరికి హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ నిర్మూలన చట్టం 2017 పైన అవగాహన కలిగి ఉండాలని హెచ్ఐవి ఎయిడ్స్ జాతీయ టోల్ ఫ్రీ 1097 ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైద్య రంగంలో స్వచ్ఛంద సంస్థ రంగంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కొరకు విశేష కృషి కనబరిచిన వైద్య అధికారులకు, ఐ సి టి సి, ఏ ఆర్ టి, కౌన్సిలర్లకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు ప్రశంసా పత్రం మెమంటోలను అధికారుల చే అందజేయడం జరిగినది .ఈ కార్యక్రమంలో డి ఐ ఓ డాక్టర్ రత్న మన్మోహన్,క్లినికల్ సర్వీసెస్ ఆఫీసర్ దిశ ఎం చైతన్యకుమార్, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ దిశా పి కిరణ్ కుమార్, వైద్య అధికారులు డాక్టర్ మనోజ్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ బాల సుధా బాపట్ల ఏరియా వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ సిద్ధార్థ జిల్లా సైన్స్ ఆఫీసర్ సాదిక్, ఐ సి టి సి ఏ.ఆర్. టి డి.ఎస్.ఆర్.సి, బ్లడ్ బ్యాంక్ టీ. బి సిబ్బంది, న్యాయ సేవాధికార సంస్థ ప్యారా లీగల్ వాలంటీర్లు సిబ్బంది బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామ సిరి హెల్ప్ మహిళా మండలి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధిలు హెల్ప్ పి డి బివి సాగర్ ప్రోగ్రాం మేనేజర్లు సిబ్బంది పి ఎస్ కే నర్సింగ్ కాలేజీ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ ప్రభుత్వ జిల్లా పరిషత్తు పాఠశాల విద్యార్థులుపాల్గొన్నారు.





