Saturday, March 21, 2026

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం..దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపిన – గడికోట శ్రీకాంత్ రెడ్డి..10 – 15 ఏళ్లుగా నిరంతరంగా పెన్షన్ పొందుతున్న దివ్యాంగులను జాబితా నుంచి తొలగించడం ప్రజాహితానికి విరుద్ధం.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 03 ~అన్నమయ్య జిల్లా :-: దివ్యాంగుల సంక్షేమంపై జగన్ పాలనలో చేసిన సేవలు చారిత్రాత్మకాలుగా దివ్యాంగుల మదిలో నిలిచిపోయాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. డిసెంబరు 3వ తారీకున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. మనిషిని తీర్చిదిద్దేది శరీర సామర్థ్యం కాదని, మనసులోని మంచితనం, ధైర్యం, పట్టుదలే నిజమైన బలమని ఆయన పేర్కొన్నారు. జీవితంలో ఏ అవరోధం వచ్చినా ఆత్మన్యూనతకు లోను కాకుండా, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని దివ్యాంగులకు గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గత జగన్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని సేవగా, బాధ్యతగా తీసుకుని ఎన్నో కార్యక్రమాలు అమలు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాయచోటి జిల్లా పరిధిలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి సహకారంతో ట్రై సైకిళ్లు, బ్యాటరీ త్రీ వీలర్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు వంటి అవసరమైన సహాయక పరికరాలు, సబ్సిడీ లోన్లు పంపిణీ చేసిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఎడాదిన్నర పూర్తవుతున్న ఏ ఒక్క వర్గ ప్రజలకు న్యాయం చేసింది లేదని ప్రతి ఒక వర్గ ప్రజలకు అన్యాయమే చేకూరుతావుందని ఏది చేయకపోయినా దివ్యాంగులనైనా ఆదుకోవాలని వాళ్ల ఉపాధి కొరకు కూటమి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వడ్డీ లేని రుణాలు అందించి వాళ్ల కుటుంబాన్ని ఆదుకోవాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలు, అవసరాలను తెలుసుకుని పరిష్కరించడానికి గత ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి దివ్యాంగుడికి జగన్ పాలనలో నిష్పక్షపాతంగా పెన్షన్ అందేదని నేటి కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా వికలాంగుల పెన్షన్లతో పాటు ఏ కొత్త పెన్షన్లును మంజూరు చేయలేక పోతున్నారని ఆయన ఆరోపించారు. ఇది వరకే పెన్షన్ పొందుతున్న దివ్యాంగులకు సదరం రీ వెరిఫికేషన్ పేరిట పెన్షన్ల కోతకు పాల్పడటం అత్యంత అన్యాయంతో కూడిన అమానుషమని గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 10–15 ఏళ్లుగా నిరంతరంగా పెన్షన్ పొందుతున్న దివ్యాంగులను కూడా జాబితా నుంచి తొలగించడం ప్రజాహితానికి విరుద్ధమన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ ఇస్తామని ఎన్నికల ముందు ఘోషించిన హామీని కూటమి ప్రభుత్వం పూర్తిగా మరిచి పోయిందన్నారు. వాగ్దానాలు కేవలం మాటలుగానే మిగిలి పోయాయని, సామాజిక న్యాయంపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం బహిర్గతమైందని వ్యాఖ్యానించారు. దివ్యాంగుల గౌరవం, హక్కులను కాపాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News