Friday, March 20, 2026

*దొంగల మర్రి చెక్‌పోస్ట్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ** సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన వాహన తనిఖీలు—*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈనేపథ్యంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, కొడిమ్యాల్ మండలంలోని దొంగల మర్రి చెక్‌పోస్ట్‌ను మంగళవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఎలాంటి సడలింపులు లేకుండా అన్ని చెక్‌పోస్టులను పకడ్బందీగా నడిపించాలన సిబ్బందికి సూచించారు.*ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు*తనిఖీ అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నగదు, మద్యం, ఉచిత సరుకులు వంటి ప్రలోభాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. అక్రమంగా డబ్బు, మద్యం లేదా వస్తువులు తరలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సరైన పత్రాలు లేకుండా భారీ మొత్తంలో నగదు తీసుకెళ్తే సీజ్ చేయడం తప్పదన్నారు. అత్యవసర అవసరాలకు క్యాష్ ఉంటే బిల్లులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు.*ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి*చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి ఎస్పీ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద రవాణాపై సున్నా సహనంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఎస్పీతో పాటు మల్యాల సీఐ రవి, ఎస్ఐ సందీప్, చెక్‌పోస్ట్ సిబ్బంది పర్యవేక్షణలో పాల్గొన్నారు.____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News