Saturday, March 21, 2026

*జగిత్యాల ఆక్సిజన్ హాస్పిటల్ లో బ్రెయిన్ శస్త్ర చికిత్స విజయవంతం.* ————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………జగిత్యాల పట్టణంలోని ఆక్సిజన్ హాస్పిటల్ ఎమర్జెన్సీ బ్రెయిన్ శస్త్ర చికిత్స జరిగి పేషెంట్ పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. నవంబర్ 16వ తేదీన అపస్మారక స్థితిలో ఉన్న చల్గల్ గ్రామానికి చెందిన ఓ పెషేంట్ ను జగిత్యాల ఆక్సిజన్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం సెరేబెల్లర్ హేమరేజ్ ( మెదడులో రక్తస్రావం గడ్డ కట్టడం )తో బాధపడుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఎమర్జెన్సీ కేస్ కావడంతో కరీంనగర్ కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ హనుమా నాయక్, అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో బ్రెయిన్ శస్త్ర చికిత్స నిర్వహించారు. నాలుగు రోజులు వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ పూర్తిగా కోల్కున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా అనస్తీసియా స్పెషలిస్ట్ డాక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ మూడు గంటల పాటు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయినట్లు తెలిపారు. ఇలాంటి క్రిటికల్ కేసుల్లో రికవరీ శాతం చాలా తక్కువగా ఉంటుందని అయితే తమ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగి పేషెంట్ విజయవంతంగా రికవరీ అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News