Saturday, March 21, 2026

అక్రమ ఆయుధాలతో హత్యాయత్నం.నిందితుడిని అరెస్ట్ చేసిన కౌటాల పోలీసులుబీహార్‌ నుంచి ఆయుధాలు కొనుగోలు, వ్యాపారి పై హత్యకు ప్రయత్నం , పోలీసులకు చిక్కిన నిందితుడునిందితుల నుండి ఒక పిస్తోల్, ఒక తపాంచ, రెండు మ్యాగ్జిన్లు స్వాధీనం.

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 02కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకౌటాల పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన పత్రికా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నితికా పంత్నిందితున్ని పట్టుకోవడంలో కృషిచేసిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీఅక్రమ ఆయుధాలు కొనుగోలు చేసి, బెదిరింపు లేఖలు రాసి హత్యాయత్నం చేసిన నిందితుని అరెస్టు చేసి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ ,కౌటాల పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో వివరాలు వెల్లడించారు.తేదీ 18.10.2025 రోజున కౌటాల మండలం కు చెందిన ఒక భాదితుడు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి జూన్ నెల 12 వ తారీకు న తనయొక్క ఫెర్టిలైజర్ షాప్ షెట్టర్ కు, 50 లక్షల రూపాయలు చంద్రపూర్, మహారాష్ట బస్ స్టాండు కి వచ్చి,సాయంత్రం కల్లా ఇవ్వాలని, లేనిచో మరియు ఇట్టి విషయాన్ని పోలీసు వారికి గాని ప్రెస్ వారికి గాని తెలిపిన చో,భాధితున్ని లేదా అతని కుటుంబ సభ్యులను తుపాకి తో కాల్చి చంపుతామని లేఖ రాసి పెట్టినాడు అని, తేదీ 26.09.2025 రోజున ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించినాడని మరియు తేదీ 15.10.2025 రోజున భాదితుని తమ్ముడు బైకు పై తన ఇంటికి వెళ్తుండగా, మార్గ మద్యలో లైటు ఫోకస్ మొఖం పై కొట్టి, ఆపడానికి ప్రయత్నించగా, ఆపకుండా వెళ్ళడం తో, పెద్దగా.శబ్దం.చేసి చంపడానికి ప్రయత్నించినాడని దరఖాస్తు ఇవ్వగా దాని మీద కేసు నమోదు చేసి,దర్యాప్తు చేపట్టి, నేరస్తుడు అయిన కుర్బంకర్ అజయ్, తండ్రి:బండు, వయస్సు: 31 సంవత్సరాలు, R/o కౌటి–సాండ్గావ్ను ఈరోజు ఉదయం ముత్తమ్పేట క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న కౌటాల పోలీసులు అరెస్ట్ చేసి, నిందితుని వద్ద నుండి ఒక పిస్తోల్, ఒక తపంచా (దేశి కట్ట), రెండు మ్యాగజిన్ లు, 15 చిన్న బుల్లెట్ లు ( పిస్టోల్ కి చెందినవి), ఒక పెద్ద బుల్లెట్ (తపంచా కి చెందినది), మరియు ఐదు ఖాళీ కోకలు, సెల్ ఫోన్ ఒక బైకు మరియు ఇతర వస్తువులు స్వాదిన పర్చుకొనయినది. నేరస్థుడు నేరం చేసిన విధానం నేరస్తుడు అయిన కుర్బంకర్ అజయ్, తండ్రి:బండు, వయస్సు: 31 సంవత్సరాలు, R/o కౌటి–సాండ్గావ్ అను అతను సులువుగా తక్కువ సమయం లో , ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యం తో హిందీ సినిమాలు చూసి ప్రేరణ పొంది బాగా డబ్బున్న వారిని బెదిరించి, భయపెట్టి అవసరమైతే చంపి అయినా.ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకుని తేదీ 11/12.06.2025 రోజున రాత్రి సమయం నందు బెదిరింపు లేఖలు రాసి, 50 లక్షలు ఇవ్వాలని లేనిచో బాధితుడిని మరియు అతని కుటుంబ సభ్యులను చంపుతామని రెండు లెటర్లు రాసి భాదితుడి యొక్క ఫెర్టిలైజర్ షాప్ షెట్టర్ కు పెట్టినాడు.కానీ బాధితుడు స్పందించకపోవడంతో యూట్యూబ్ నందు పిస్టోలు, తపంచా లాంటి మారణాయుధాలు బీహార్ లో దొరుకుతాయని తెలుసుకుని అక్కడికి జులై చివరి వారంలో వెళ్లి ఆగస్టు మొదటి వారం వరకు అక్కడే ఉండి బాబు సాహెబ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి రూపాయలు 55,000 చెల్లించి ఒక పిస్టోలు, రెండు మ్యాగజైన్లు దీనికి సంబంధించిన 20 బుల్లెట్లు మరియు ఒక తపంచ, దీనికి సంబంధించిన ఒక బుల్లెట్ కొనుగోలు చేసి అక్కడే షూటింగ్ నేర్చుకొని మూడు బుల్లెట్లు అక్కడే ప్రాక్టీస్ లో ఫైర్ చేసి అట్టి ఖాళీ కోకలను తీసుకుని తన ఇంటికి వచ్చినాడు. ప్రాణహిత నది ఒడ్డున ఒక బుల్లెట్ గాలి లోకి ఫైర్ చేసి ప్రాక్టీస్ చేసినాడు. తిరిగి తేది 26.9 2025 రోజున కాగజ్నగర్ నుండి మహారాష్ట్రకు వెళ్ళు ట్రైన్ లో ఎక్కి అందులో ఒక గుర్తు తెలియని వ్యక్తి యొక్క ఫోన్ తీసుకొని బాధితునికి ఫోన్ చేసి డబ్బులు చెల్లించని యడల చంపేస్తామని బెదిరించినాడు అయినా బాధితుడు స్పందించకపోవడంతో తేదీ 15.10.2025 రోజున అందాజ రాత్రి 0700 గంటలకు బాధితుని తమ్ముడిని చంపాలని ఉద్దేశంతో పిస్టోల్లో రెండు బుల్లెట్లు నింపుకొని మార్గమధ్యలో వేచి చూసి భాదితుని తమ్ముడు రాగానే అతని ముఖము పైన లైట్ ఫోకస్ పెట్టి అతను అని గ్రహించి ఒక బుల్లెట్ ఫైర్ చేసినాడు కానీ అది గురి తప్పడంతో అక్కడి నుండి పారిపోయినాడు మళ్లీ ఈరోజు అనగా తేదీ 02.12.2025 రోజున బాధితుడు లేదా అతని కుటుంబ సభ్యులు వారి ఫెర్టిలైజర్ షాపుకు ఉదయం వస్తారని తెలుసుకొని ఎలాగైనా కాల్చి చంపాలని ఉద్దేశంతో పిస్టోలు మరియు మూడు బుల్లెట్లు తీసుకొని బైకుపై వెళ్తుండగా మార్గమధ్యలో ఎన్నికల సందర్భంగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడి తన నేరాన్ని ఒప్పుదల చేసినాడు.ఇట్టి కేసు దర్యాప్తు ను కాగజ్నగర్ డిఎస్పి వహిదుద్దీన్.ఆద్వర్యం లో చేపట్టడం జరిగినది. ఇట్టి దర్యాప్తు కు కృషి చేసిన కౌటాల సీఐ బి.సంతోష్ కుమార్, కౌటాల ఎస్.ఐ డి. చంద్రశేఖర్, కాగజనగర్ రూరల్ ఎస్.ఐ సందీప్, పోలీస్ సిబ్బంది రమేష్, సాయిరాజ్, దుర్గ ప్రసాద్, దీపక్ లను ఎస్పి నితిక పంత్. అభినందించినారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News