నేటి సాక్షి 02 నంద్యాల :—భారత్ – జార్జియా దేశాల మధ్య న్యూ ఢిల్లీలో మంగళవారం లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా నాయకత్వంలో జార్జియా ప్రతినిధి బృందంతో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. జార్జియా ప్రతినిధుల బృందానికి భారత్ తరుపున నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి బృందం స్వాగతం పలికారు. జార్జియా షల్వా పాపువాష్విలి పార్లమెంటు ఛైర్మన్, ఆయన ప్రతినిధి బృందం భారతదేశానికి వచ్చారు. రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక చర్చలలో కూడా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. చర్చల అనంతరం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జార్జియా ప్రతినిధులతో కలిసి లోక్ సభ స్వీకర్ ఓం ప్రకాష్ బిర్లా, భారత ప్రతినిధులు, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిలు కూడా భోజనానికి హాజరయ్యారు. ఈ ద్వైపాక్షిక చర్చలు భారత్, జార్జియా దేశాల సంబంధం భలోపేతం, ఉమ్మడి ప్రజాస్వామ్యం, విలువలు, సమీప భవిష్యత్ లో భారత్ – జార్జియా దేశాల పార్లమెంటరీ స్నేహ సమూహాన్ని ఏర్పాటుకు, విస్తరిస్తున్న పార్లమెంటరీ భలోపేతకు ఈ ద్వైపాక్షిక చర్చలు దోహదపడుతాయన్న నమ్మకాన్ని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వ్యక్తం చేశారు.





