నేటి సాక్షి 02 పాములపాడు:-పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎర్రసాని చిన్న లక్ష్మన్న(70) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ ఆయన పార్తివదేహానికి, పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె అంతర్జాతీయ సమాజసేవకుడు & హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు తరఫున ఆయన కుటుంబానికి 5000/-రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలని, మీ కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా వుంటామని మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకొని సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు ఆయన కుటుంబానికి సంతాపాన్ని, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, సుబ్బారావు, జీవన్న, సుబ్బరాయుడు, ఎల్లసుబ్బడు, తదితరులు పాల్గొన్నారు.





