నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 02 ~అన్నమయ్య జిల్లా :-: అనంతపురం పట్టణంలో అమెరికా “డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్” వారి సౌజన్యంతో రాయలసీమ సాంస్కృతి వేదిక మరియు వేమన అధ్యయన కేంద్రం వారి ఆధ్వర్యంలో నిర్వహకులు డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి సారధ్యంలో సోమవారం రాయలసీమ మహాకవి సమ్మేళనం – 2025 కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని పెద్ద తిప్ప సముద్రం మండల కేంద్రానికి చెందిన బాస్ కేంద్ర కమిటీ సభ్యులు కేవీ రమణ పాల్గొని గేయాన్ని వినిపించి అందరిని ఉత్సాహపరిచారు. “పాపాఘ్ని నది” మరియు “పి.టి.యం చెరువు” లపై పద్య కవిత్వం ఆలపించారు. ఆయన పద్యాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరు చప్పట్లతో మారుమోగించారు. ఈ సందర్భంగా ఆయనకు డాక్టర్ అప్పి రెడ్డి హరినాథ్ రెడ్డి చేతుల మీదగా ప్రశంసాపత్రం తో పాటు జ్ఞాపికతో సత్కరించి దుశ్శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ~~~~~~~~~~~~~~~~~~





