Saturday, March 21, 2026

*జిల్లాలో అగ్రగామిగా నిలిచిన జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల**-విద్యా కమిషనర్ ఉత్తర్వుల మేరకు అకాడమిక్ ఆడిట్ బృందం తనిఖీ*————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………….ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), జగిత్యాల, తేదీ 2- 12-25 నాడు కళాశాల విద్యా కమిషనర్ ఉత్తర్వుల మేరకు అకాడమిక్ ఆడిట్ బృందం తనిఖీల్లో భాగంగా హుజరాబాద్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి. ఇందిరా దేవి, డా. శ్రీనివాస్ అకాడమిక్ ఆడిటర్ సలహాదారులుగా కళాశాలను సందర్శించారు.ఈ సందర్భంగా అన్ని విభాగాలను సంయుక్తంగా సూక్ష్మంగా పరిశీలించారు.వివిధ విభాగాల అధ్యాపకులు ఆయా రంగాల్లో విద్యార్థులు సాధించిన విజయాలను అంశాల వారిగా సమర్పించారు.తదనంతరం ముగింపు సమావేశంలో వారు మాట్లాడుతూ కళాశాలలోని వసతులు, వనరులు పై సంతృప్తి వ్యక్తం చేశారు. కళాశాలలోని వివిధ విభాగాలు సమన్వయంతో పని చేసినప్పుడు కళాశాల అభివృద్ధి చెందుతుందని అన్నారు.కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట్ల రామకృష్ణ, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డా.ప్రమోద్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ చంద్రయ్య, ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ డా.వాసవి, అకాడమిక్ కోఆర్డినేటర్ రామచంద్రం, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డా.సంగీత రాణి, రహీం,డా. శ్రీలత, నీరజ, డా. సుజాత, మల్లికార్జున్, డా. జమున ఇతర అధ్యాపక అధ్యాప కేతర బృందం పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News