Saturday, March 21, 2026

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ తనయుడు రోషన్ అకాల మరణం..పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 03 ~అన్నమయ్య జిల్లా :-: సోమల మండలం నెల్లిమంద సర్పంచ్, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ తనయుడు రోషన్ (38) బుధవారం తెల్లవారి జామున ఇంట్లో గొడవల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం తెలుసుకున్న గ్రామ వైసీపీ శ్రేణులు హుటా హుటిన వెంకటరమణ స్వగృహానికి చేరుకొని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. తమతో కలిసి తిరుగుతూ గ్రామంలో అందరిని ఆత్మీయంగా పలకరించే రోషన్ ఇకలేరంటూ ఆ అబ్బాయినే తల్చుకుంటూ రోదించారు. గ్రామంలోను విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులంతా తరలివచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చి అవ్వ తాత, అవ్వ తాత, పెద్దమ్మ, పెద్ద నాన్న అంటూ మన మధ్య తిరిగే యువకుడు అకాల మృతితో గ్రామస్తులు సైతం దుఃఖంలో మునిగారు. బుధవారం రాష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, వైసీపీ యువ నాయకులు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి తో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నెల్లిమంద గ్రామానికి విచ్చేసి నేరుగా వెంకటరమణ స్వగృహానికి చేరుకుని రోషన్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన భార్య కు ధైర్యం చెప్పారు. పిల్లలను అక్కున చేర్చుకొని ఇంత చిన్న వయసులో కన్న తల్లిదండ్రులను, ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటూ పార్టీకి ఎంతో సేవలు అందించిన రోషన్ ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నాడో అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం కన్నీటి పర్యంతమయ్యారు. కడసారి ఆయన్ని చూసేందుకు సోమల మండలానికి చెందిన వైసీపీ శ్రేణులు, యువకులు, ఆప్తులు, బంధుమిత్రులు, గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చి కన్నీటితో వీడ్కోలు పలికారు. ~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News