Saturday, March 21, 2026

*జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత నామినేషన్ల దాఖలు** 7 మండలాల్లో 144 గ్రామాలకు భారీగా 3,868 దరఖాస్తులు* సర్పంచ్ స్థానాలకు 941, వార్డు సభ్యులకు 2,927 నామినేషన్లు—-*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. *ఊహించినదానికంటే ఎక్కువ..*7 మండలాల్లో 144 గ్రామాల్లో నిర్వహించనున్న ఎన్నికల కోసం సర్పంచ్ స్థానాలకు మొత్తం 941 నామినేషన్లు అందాయి. బీర్పూర్ మండలం నుంచి 85, జగిత్యాల 37, జగిత్యాల రూరల్ 179, కొడిమ్యాల 165, మల్యాల 151, రాయికల్ 205, సారంగాపూర్ నుంచి 119 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ తెలిపారు.*వార్డు సభ్యులు తక్కువే కాదు..*వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 2,927 నామినేషన్లు వచ్చాయి. బీర్పూర్ మండలంలో 275, జగిత్యాల 117, జగిత్యాల రూరల్ 550, కొడిమ్యాల 509, మల్యాల 526, రాయికల్ 598, సారంగాపూర్ మండలంలో 352 నామినేషన్లు స్వీకరించినట్లు ఆయన స్పష్టం చేశారు. మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అంతరాయం లేకుండా ముగిసిందని కలెక్టర్ పేర్కొన్నారు.___

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News