నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 03 ~అన్నమయ్య జిల్లా :-: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జీరో హావర్ లోని విరామం లో బుధవారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛమందించి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు సరైన వసతులను సమకూర్చడం లేదని విద్యార్థులకు అవసరమయ్యే ఏ ఒక పథకం ఇంత వరకు ఆచరించలేదని దీంతో బాగా చదువుకోవాల్సిన విద్యార్థులు విద్యను వీడి ఇతర పనులకు వెళ్తున్న పరిస్థితి ఏర్పడిందని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టిన ఆరు నెలల్లోనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా విద్యార్థులకు అన్ని పథకాలు అందించారని కానీ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఎడాదిన్నర పూర్తవుతున్న ఇంతవరకు విద్యార్థులను పట్టించుకోలేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక విషయానికొస్తే గత సంవత్సరం మంజూరు చేసిన రాయచోటి కేంద్రీయ విద్యాలయాన్ని కార్యనిర్వాహణలోకి తీసుకురావాలని అభ్యర్థించారు. గత విద్యా సంవత్సరం నుంచే పాఠశాల ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ పరిపాలన కారణాలవల్ల ప్రారంభం కావాల్సిన పాఠశాల ఆలస్యమైందని ఈ నేపథ్యంలో 2026 – 27 విద్యా సంవత్సరం ప్రారంభానికి పాఠశాల ప్రారంభానికి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా తగు ఏర్పాటుకార్యకలాపాలు నిర్వహించేలా తగు ఏర్పాట్లు చేయాలని దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మిథున్ రెడ్డి కేంద్ర విద్యా శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ కు విన్నవించారు. రాయచోటి పరిసర ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన కేంద్రీయ విద్య రావడానికి ఇది అత్యంత అవసరమైందిగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి దేవేంద్ర ప్రధాన్ కు స్పష్టం చేశారు. ~~~~~~~~~~~~~~~~~~





