నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. కొత్తగూడెం బహిరంగ సభలో ఆయన చేసిన హిందూ దేవీ–దేవతలను కించపరిచే వ్యాఖ్యలు సమాజాన్ని తీవ్రంగా బాధించాయని బీజేపీ నేతలు మండిపడ్డారు.*బేషరతుగా క్షమాపణ చెప్పాలి* కోరుట్ల పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, చెట్లపెల్లి సాగర్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హిందువులకు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, ఇకముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు సూదవేని మహేష్, తిరుమల వాసు, పోతుగంటి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మడవేని నరేష్, ఉపాధ్యక్షులు తోట రాజేశం, ముల్క ఆంజనేయులు, మైదం సత్యనారాయణ,అలాగే బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాడిగే మహేష్, పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు కలాల సాయి చందు, పట్టణ ప్రధాన కార్యదర్శి గోనెల రాజశేఖర్, తదెలా ప్రశాంత్, ఆకుల ఆనంద్, పంబల్ల అజయ్, ప్రేమ్ తో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ–బీజేవైఎం కార్యకర్తలు పాల్గొని నిరసన తెలిపారు.____





