Saturday, March 21, 2026

*అన్నదాతకు అండగా చంద్రన్న ప్రభుత్వం*•రైతులకు వెన్నుదన్నుగా నిలిచేలా ఎఫ్ పిఓలు•రైతులకు ఏ కష్టం రానివ్వం అండగా ఉంటాం •బర్లీ రైతులును ఆదుకున్న ఘనత ప్రభుత్వానిదే •రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తాం •సమస్యలు పరిష్కరించేలా ఎఫ్ పిఓలతో సంఘటితం•పంటలకు మద్దతు ధర, పథకాలు పునరుద్ధరణ •రైతన్నా మీ కోసంలో ఎమ్మెల్యే ఏలూరి

నేటి సాక్షి,బాపట్ల జిల్లా (పర్చూరు)అన్నదాతకు చంద్రన్న సారధ్యంలో కూటమి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని, ఎఫ్‌పిఓలు రైతుకు బల రైతు బలమే రాష్ట్ర బలం అన్న నినాదంతో ప్రభుత్వం కదులుతోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం చిన్నగంజాం రైతు భరోసా కేంద్రంలో రైతన్నా మీ కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రైతు కుటుంబానికి విశ్వాసం కలిగించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ప్రస్తుతం పనిచేస్తున్న చంద్రన్న ప్రభుత్వం మాత్రమే అన్నారు. రైతు సమస్యలను అర్థం చేసుకుని, సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటూ, పంట పండించడం నుంచి మార్కెట్‌లో అమ్మకం వరకు అన్నింటిలోనూ రైతుకు తోడుగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రతినిత్యం పని చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతు సంతోషమే గ్రామాభివృద్ధికి మూలం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు *రైతుల వెన్నుదన్నుగా ఎఫ్‌పిఓలు*రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. రైతుల అనిశ్చితి, మధ్యవర్తుల దోపిడీ నేపథ్యంలో ప్రభుత్వం ఎఫ్‌పిఓల (Farmer Producer Organizations)ను బలోపేతం చేస్తూ రైతులను సంఘటితం చేస్తోందని పేర్కొన్నారు. మన నియోజకవర్గంలో కూడా రైతులను సంఘటితం చేసేందుకు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.గ్రామస్థాయిలో రైతులందరిని ఒకే అంబరంలోకి తీసుకువస్తూ, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరసమైన ధరకే అందేలా, పంటలకు న్యాయమైన ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.*బర్లీ రైతుల పక్షాన నిలిచిన ఘనత*నల్లబర్లీ బర్లీ రైతులు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ముందడుగు వేసి వారిని ఆదుకోవడం కూడా సీఎం చంద్రబాబు ప్రభుత్వ గొప్పతనం అన్నారు. బర్లీ టొబాకో కొనుగోళ్లలో ఆలస్యం, ధరల పడిపోవడం , పొగాకు కంపెనీలు కొనుగోలు చేయకపోవడంతో రైతులను ఆందోళనకు గురిచేసినప్పటికీ, ప్రభుత్వం జోక్యం చేసుకొని సమయానికి చర్యలు తీసుకోవడంతో రైతులలో నమ్మకం పెరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నల్లబర్లీ కొనుగోలు చేశామని వెల్లడించారు. *రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి*రైతులు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తూ గత ప్రభుత్వంలో నిర్వీర్యాని గురైన అనేక పథకాల పునరుద్ధరణ వరకూ సమగ్ర చర్యలు చేపట్టామన్నారు. చంద్రన్న ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. పలు యంత్ర పరికరాలు సూక్ష్మ పోషకాలు, డ్రిప్ ఇరిగేషన్ వంటి అనేక పథకాలను అమలు చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. పంట బీమా, మార్కెట్ యార్డుల ఆధునీకరణ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం రైతు రాజ్యం దిశగా అడుగులు వేస్తుందన్నారు.ప్రభుత్వం తీసుకుంటున్న మౌలిక నిర్ణయాలు రాబోయే పది సంవత్సరాల వ్యవసాయాభివృద్ధికి పునాది వేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకటరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి లవన్న, డి ఎల్ డి ఓ పద్మావతి ,తాసిల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో ధనలక్ష్మి ,ఏవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News