నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 04 ~అన్నమయ్య జిల్లా :-: : బీసీ నాయకుడు సిబ్యాల విజయ భాస్కర్‌పై దాడిహేయమైన చర్యనని వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు విజయ భాస్కర్‌పై జరిగిన దాడిని వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రోజురోజుకు రాజకీయాల్లో అనాగరిక ధోరణులు పెరుగుతున్నాయని, ఇటువంటి నీచ సంస్కృతికి తెరలేపుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా మాట్లాడితే టార్గెట్ చేయాలనే దురుద్దేశంతో బీసీ వర్గానికి చెందిన వారైనా మాజీ ఎంపీపీ అంపాబత్తిన రెడ్డయ్య ఇంటిపై దాడి, మల్లూరు రెడ్డి వరప్రసాద్‌పై దాడులు చేయడం అవివేకమని గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాజాగా విజయ భాస్కర్‌పై తీవ్రమైన దాడికి తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రజల కోసం గళం విప్పే నాయకులపై దాడులు చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. నిందితులను గుర్తించి 48 గంటల్లో అరెస్ట్ చేయకపోతే అది పోలీస్ వ్యవస్థకే మచ్చగా మిగిలిపోతుందని గడికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై సిబ్యాల విజయ భాస్కర్ మాట్లాడుతూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులే తనపై దాడి చేశారని వచ్చి రాగానే తన తల్లిని కొట్టబోయారని ఆమె రోధిస్తూ కాళ్లపై పడడంతో వదిలేసారని ఇంట్లో కూర్చొని ఉంటే తనపై సుమారు 20 మంది దాకా మూకుమ్మడి దాడి చేశారని కొట్టొద్దండని వాళ్ల కాళ్లు పట్టుకున్న వదల్లేదని సిబ్యాల విజయ భాస్కర్ పేర్కొన్నారు. మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవానాథ్ రెడ్డి ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి హేయమైన చర్య అంటూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు తగవని దేవా నాథ్ రెడ్డి అన్నారు. సిబ్యాల విజయభాస్కర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రజా స్వామ్యంలో బావా స్వేచ్ఛ వాతావరణాన్ని హరింపచేసేలా టీడీపీ నేతలు వారి అనుచరులతో వైఎస్ఆర్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై వరుసగా దాడులు చేయడం హేయమైన చర్యగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవనాథరెడ్డి అభివర్ణించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు సిబ్యాల విజయభాస్కర్ పై బుధవారం రాత్రి టీడీపీ నాయకులు మూకుమ్మడి దాడిని గురువారం ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా చేసే రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలకు అదే రీతిలో సమాధానం చెప్పుకునే అవకాశముంటుందన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో రాజకీయ ప్రత్యర్థులపై టీడీపీ నాయకులు దాడులు చేయించి భయానక వాతావరణం సృష్టించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఆటవిక రాజ్యాన్ని తలపించేలా దాడులు చేయడం తగదని దేవానాథ్ రెడ్డి హితువు పలికారు..~~~~~~~~~~~~~~~~~~





