నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 04 ~అన్నమయ్య జిల్లా :-: కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేసి కాలయాపన చేస్తోందని కూటమి ప్రభుత్వంలో నిండున దగా పడిన వారిలో మొట్టమొదట రైతులేనని రైతులను నిలువునా దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది కూటమి ప్రభుత్వమేనని పీలేరు నియోజకవర్గ సమాచార హక్కు చట్టం అధ్యక్షులు మద్దిరాళ్ళ మల్లికార్జున ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం పీలేరులో ఆయన మాట్లాడుతూ వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. దళారుల వ్యవస్థను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం అయిందన్నారు. వరి రైతులకు సకాలంలో యూరియా అందించటంలో చంద్రబాబు విఫలం అయ్యారని ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి కనీసం రైతులకు అందుబాటులో హార్వెస్ట్ మిషన్లు తీసుకురావటంలోను కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం అయిందని ఆయన ఆరోపించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు కనీసం టార్పల్ పట్టలు అందించలేని స్థితిలో చంద్రబాబు పాలన చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి రైతులకు ఉపయోగపడే ఆర్బీకే సెంటర్ లు ఏర్పాటు చేసి తడిచిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతు పండించే వరి పంటకు ఇన్సూరెన్స్ చేయకుండా రైతులను చంద్రబాబు దగా చేశాడన్నారు. అర కాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతు ఆవేదన చెందుతున్నారన్నారు. కనీసం వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం అయిందన్నారు. కులం చూడకుండా పార్టీలను చూడకుండా, రైతును రైతుగా చూడటంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.రైతుకు న్యాయం చేయలేక వ్యవసాయం దండగ అంటూ, బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంటూ, కల్లబొల్లి మాటలు చెబుతూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని మద్దిరాళ్ళ మల్లికార్జున మండిపడ్డారు..~~~~~~~~~~~~~~~~~~




