Saturday, March 21, 2026

*డిసెంబర్ 20 ,21 తేదీల్లో విజయవాడలో జరిగే భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయండి* *బాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలకుంట శ్రీనివాసులు*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)భారతీయ అంబేద్కర్ సేన బాస్ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా ఈనెల 20,21 వ తేదీన విజయవాడ కేంద్రంగా జరిగే బాస్ రాష్ట్ర మహాసభలకు బాస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలకుంట శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం పీలేరులో స్థానిక బాస్ కార్యాలయం నందు బాస్ నాయకులు గుండ్లూరు రవీంద్ర అధ్యక్షతన జరిగిన బాస్ ముఖ్య నాయకుల సమావేశానికి బాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలకుంట శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈనెల 20, 21 తేదీల్లో విజయవాడలో జరుగు రాష్ట్ర మహాసభల విషయంపై బాస్ నాయకులతో చర్చించారు. అనంతరం పాలకుంట శ్రీనివాసులు పాత్రికేయులతో మాట్లాడుతూ* అంబేద్కర్ మహానీయుడు స్వప్నించిన కుల నిర్మూలన- స్టేట్ సోషలిజం సాధించడానికి , బౌద్ధ సాంస్కృతిక జీవనం- రాజ్యాధికారం లక్ష్యంగా 2012 డిసెంబర్ 20 తేదీన భారతీయ అంబేద్కర్ సేన ఆవిర్భవించిందని, దేశానికి జాతీయ గీతాన్ని అందించిన మదనపల్లిలో పురుడు పోసుకున్న భారతీయ అంబేద్కర్ సేన ఆనాటి నుంచి నేటి వరకు అంచెలంచలుగా ఎదిగి పలు రాష్ట్రాల్లో విస్తరించి తన పదమూడేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసి 14 వసంతంలోకి అడిగిడుతున్న సందర్భంగా బాస్ ఉద్యమ శ్రేణులకు,శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేసి , బాస్ భవిష్యత్ పోరాటాలకు ఇంతకు మునుపు అందించిన సహకారం అందించాలని వీరు కోరారు. బాస్ వ్యవస్థాపకులు పిటిఎం శివప్రసాద్ ఆదేశాల మేరకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, జాతీయ అంబేద్కర్ బ్యాంకు, భూమిలేని నిరుపేదలకు సాగుభూమి పంపిణీ చేయాలని, మూడు సెంట్లు ఇంటి స్థలం- పది లక్షల నిర్మాణ సాయం, సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చెయ్యాలని, బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని, వివిధ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని, బౌద్ధ విహారాలు అను అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి డిసెంబర్ 20వ తేదీ వరకు బాస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించి అవగాహన కల్పించాలని బాస్ శ్రేణులకు వీరు పిలుపునిచ్చారు. డిసెంబర్ 20, 21వ తేదీల్లో విజయవాడలో భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని కావున బాస్ ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పాలకుంట శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు ఎర్రబల్లి మల్లికార్జున, గుండ్లూరు రవీంద్ర, దప్పేపల్లి ఆనంద్ కుమార్,పల్లె పోగు హరినాథ్, జనార్ధన్, రాజేంద్ర నాయక్, సురేష్ నాయక్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News