నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 04 ~అన్నమయ్య జిల్లా :-: తిరుమల మహా పాదయాత్రకు ఆంక్షలు పెట్టడం పై ఆకేపాటి అమరనాథ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ నేతలు ఇలా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. గత 22 యేళ్లుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న వందలాది మంది భక్తులతో అన్నమయ్య నడిచిన మార్గం ద్వారా తిరుమల శ్రీ కలియుగ వైకుంఠ నాథుడు శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనాటి నుండి ఈనాటి వరకు ఆనవాయితీగా వస్తోందని కానీ కూటమి ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మీద ఎందుకు కక్ష కట్టిందో అర్థం కావడం లేదని రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఆరోపించారు.22 యేళ్లుగా ఆంక్షలు లేనిది ఇప్పుడు ఎందుకో మరి..గడిచిన 22 యేళ్లుగా అన్నమయ్య నడియాడిన ప్రాంతంలో పాదయాత్ర చేస్తూనే ఉన్నాం. అప్పటి నుండి ఆంక్షలు లేనిది ఏ ప్రభుత్వము పెట్టనిది ఈసారి ఎందుకో కూటమి ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆకేపాటి అమరనాథ్ రెడ్డి విమర్శించారు. ఒకసారి పాదయాత్ర చేసే సమయంలో నడవలేక అడవిలోనే రాత్రంతా ఉండిపోయామని ఆయన గుర్తు చేశారు. అప్పుడు ఏమీ చేయలేని మృగాలు ఇప్పుడేమి చేస్తాయని ఆకేపాటి ప్రశ్నించారు. అటవీ శాఖ అధికారులు చెబుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఆకేపాటి మండిపడ్డారు..ఒకసారి తుఫానులో పాదయాత్ర చేసాం. అప్పుడు కుంటల్లో నీళ్లు లేవా..ఒక్కసారి తుఫానులో పాదయాత్ర చేసాం. అప్పుడు కుంటల్లో నీళ్లు లేవా. అప్పటి జనసేన రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పాదయాత్ర గురించి కూడా చెప్పడం జరిగిందన్నారు. అన్నమయ్య నడియాడిన కాలిబాటలో అటవీ, పోలీసు శాఖ ఉన్నతాధికారుల ఆంక్షలతో భక్తుల నమ్మకాన్ని ఓమ్ము చేసి మనోభావాలు దెబ్బ తింటాయని అకేపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించినప్పుడే.. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించినప్పుడే అన్నమయ్య కలియాడిన మార్గంలో కాలిబాటలో పాదయాత్ర నిర్వహించిఆ ప్రత్యక్ష దైవంశ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని అమర్ నాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం రాజంపేట మండల పరిధిలోని ఆకేపాడు గ్రామంలోని అకేపాటి ఎస్టేట్ లో గురువారం వైసీపీ జిల్లా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఆయన సోదరుడు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి తో కలసి 23వ తిరుమల మహా పాదయాత్ర పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ అన్నమయ్య నడియాడిన కాలిబాటలో వన్య మృగాలు ఉన్నాయని ఎవ్వురు అన్నమయ్య కాలిబాటలో పాదయాత్ర చేయరాదని ఈ కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడం చాలా బాధాకరమన్నారు. 22 సంవత్సరాల నుంచి వేల మంది భక్తులతో అన్నమయ్య నడియాడిన మార్గం ద్వారా కాలిబాటన పాదయాత్రగా వెళ్లి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం భక్తుల అపార నమ్మకమన్నారు. అటవీశాఖ, పోలీసు ఉన్నతాధికారులు అన్నమయ్య కాలిబాటలో ఆంక్షలు విధించి భక్తుల నమ్మకాలను ఓమ్ము చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. ప్రభుత్వ ఆంక్షలను గౌరవవిస్తూ 23వ తిరుమల మహా పాదయాత్రలో భాగంగా శుక్రవారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించి తిరుమల మహాపాదయాత్రకు వెళ్లే భక్తులతో ఎకశిల నగరం ఒంటిమిట్టకు పాదయాత్రగా వెళ్లి సీతమ్మ సమేత శ్రీ కోదండరామ స్వామి దర్శించుకుంటామన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించినప్పుడు మాత్రమే అన్నమయ్య నడియాడిన కాలిబాటలో పాదయాత్రగా వెళ్లి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ మహావిష్ణువు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానన్నారు..~~~~~~~~~~~~~~~~~~





