నేటి సాక్షి,నారాయణపేట డిసెంబర్ 4, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రానికి చెందిన గాజుల నారాయణస్వామి అనే రైతుకు హైదరాబాదులో గురువారం ఏషియన్ పి జి పి ఆర్ ఆధ్వర్యంలో రైతు రత్న అవార్డును అందజేశారు. మట్టి సారా వృద్ధి సేంద్రియ సాంకేతికత నీటి వినియోగ సమర్వార్త రహిత ఆవిష్కరణలను విశేష ప్రతిభ కనబరిచిన నారాయణపేట జిల్లాలోని దన్వాడ మండల కేంద్రానికి చెందిన రైతు గాజుల నారాయణ స్వామికి అవార్డును దక్కించుకున్నారు. ధన్వాడ మండల కేంద్రానికి చెందిన రైతు గాజుల నారాయణస్వామి రైతు రత్న అవార్డును దక్కించుకోవడం పట్ల తన్వాడ మండలంలోని వివిధ గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు.





