Saturday, March 21, 2026

జీసస్ వర్డ్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు*

*నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) విశాఖపట్నం మురళి నగర్ లోని జీసస్ వర్డ్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ శంక బ్రాత భగ్ని ఐపిఎస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారు చిన్నప్పుడు నుండి మిషనరీ స్కూల్లో చదువుకున్నారని ,అలాగే వారి సతీమణి కూడా మిషనరీ స్కూల్లో చదువుకోవడం వలన క్రీస్తు గురించి కొంతవరకు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ఏసుక్రీస్తు మనందరికీ శాంతి సమాధానం ప్రేమ కలిగి ఉండాలని బోధించడమే కాకుండా చేసి చూపించారు. ఈ లోకంలో ప్రజలందరూ శాంతి సమాధానం ప్రేమతో ఉండినట్లయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే లేకుండా శాంతి సమాధానం తో ఈ సమాజం ఉంటుందని అన్నారు. అనంతరం డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ రూపొందించిన 2026 క్యాలెండర్ ని ఆవిష్కరించారు. బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ ఎం ఏ అనిల్ పాల్ బైబిల్ పటును చేశారు .అనంతరం ముఖ్య ప్రసంగీకులుగా విచ్చేసిన బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ క్రిస్మస్ వర్తమానాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నీ పుట్టుక నా పుట్టుక యాదృచ్ఛిక మని అంటే అనుకోకుండా జరిగినదని అయితే క్రీస్తు యేసు పుట్టుక అటువంటిది కాదని ఆయన పుట్టక మునుపే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే లేఖనాల్లో ఆయన ఎక్కడ పుడతాడు , ఎప్పుడు పుడతాడు ,ఆయనకి ఏమని పేరు పెడతారు, అనే టటువంటి విషయాలు చాలా స్పష్టంగా ముందే వ్రాయబడ్డాయని వాటన్నిటిని నెరవేర్చేందుకే దివి నుండి భూమి మీదికి దిగి వచ్చాడని అన్నారుఈ కార్యక్రమం ఐజాక్ ఆధ్వర్యంలో పాస్టర్ బాబి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో బిషప్ సుదర్శన్ రావు, రెవరెండ్ తేజ, రెవరెండ్ ఆశీర్వాదం, రెవరెండ్ రమణ, సోనీ ఐజాక్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News