Saturday, March 21, 2026

*ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యేక కృషి…* •దేవాలయాల పునర్నిర్మాణానికి నిధులు•ఏడు దేవాలయాలకు రూ.8.40 కోట్లు మంజూరు •ఎమ్మెల్యే ఏలూరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

నేటి సాక్షి,బాపట్ల జిల్లా (పర్చూరు)పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషి సిఫార్సుతో రాష్ట్ర ప్రభుత్వం ఏడు దేవాలయాల పునర్మాణానికి రూ.8.40 కోట్ల సిజిఎఫ్ నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సి జి ఎఫ్ నిధులు (కామన్ గుడ్ ఫండ్)మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక చొరవ,కృషితో ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. దీంతో పర్చూరు నియోజకవర్గంలో పలు ఆలయాలు పూర్వవైభవం సంతరించుకొనున్నాయి. పర్చూరులోని వేణుగోపాలస్వామి ఆలయానికి రూ.1.75 కోట్లు ,భీమేశ్వరాలయానికి రూ.1.50 కోట్లు, దేవరపల్లి లోని వేణుగోపాలస్వామి ఆలయానికి రూ.1.00 కోట్లు, గర్నెపూడి లోని విగ్నేశ్వర,విశ్వేశ్వర ఆలయాలకు రూ.1.00 కోట్లు, అనంతవరంలోని వేణుగోపాలస్వామి ఆలయం రూ.1.05 కోట్లు , సురవరపుపల్లి లోని చెన్నకేశవ దేవాలయానికి రూ. 1.05 కోట్లు, సంతరావూరు లోని శ్రీరామలింగేశ్వర ఆలయానికి రూ.1.05 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులకు 33% మ్యాచింగ్ గ్రాండ్స్ తో ఆలయాల పునర్నిర్మాణం చేపట్టనున్నారు. పర్చూరులో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ఎమ్మెల్యే ఏలూరి కృషి అభినందనీయమని ప్రజలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పలు పురాతన దేవాలయాలు ఇప్పుడు పునరుద్ధరణ వైపు అడుగులు వేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డిలకు నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే ఏలూరి కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News