నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య ) గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు పూర్తి అవగాహనతో, సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్ ఆదేశించారు. గురువారం ఐడీసీ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు జి. రమేష్తో కలిసి జిల్లా నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఏ చిన్న లోపాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి విభాగం పరస్పరం సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.మొదటి విడత ఎన్నికలు జరగనున్న ఏడు మండలాల ఎంపిడివోలను ప్రత్యేకంగా ఆదేశించిన అదనపు కలెక్టర్.. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు, భద్రతతో సహా అన్ని ఏర్పాట్లు పక్కా చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శకత, జవాబుదారితనం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిపివో రఘువరన్, జిల్లా నోడల్ అధికారులు, ఎంపిడివోలు మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు._______





