Saturday, March 21, 2026

*మాస్టర్ ప్లాన్ పేరుతో మోసపోయిన సైనికుల కుటుంబాలకు బాసట ఉంటా** రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు

నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధి మాస్టర్ ప్లాన్ పేరుతో మోసపోయిన సైనికుల కుటుంబాలకు బాసటగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఉంటానని అన్నారు. బాపట్ల పట్టణం లో రోడ్ల విస్తరణ పేరుతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ వలన సైనికుల మరియు మాజీ సైనికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్తితి గురించి బాధితుల ద్వారా తెలుసుకున్న *ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు వెంటనే ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణ షీలా దృష్టికీ తీసుకేళ్ళటమే కాకుండా స్వయంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ తో కలిసి నరాలశెట్టి పాలెం కోర్టు ప్రాంతం నుండి పెయింటర్స్ కాలని మద్యలో మాస్టర్ ప్లాన్ వలన బాధితులైన సైనికుల గృహాలను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. త్వరలో ఈ విషయాన్ని బాపట్ల కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లి న్యాయం జరిగేలా ప్రయత్నం చేద్దాం అని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణ షీలాతెలిపినట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియజేశారు.అనంతరం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు బాధిత మాజీ సైనికులతో కలిసి బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి తో సమావేశమయ్యారు.దేశ సేవలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న సైనికులు రిటైర్మెంట్ తర్వాత మున్సిపాలిటీ వారు అధికారికంగా ఇచ్చిన ప్లాన్ ల ప్రకారమే ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ పేరుతో కూలగోడతాము అనటం సమంజసం కాదు అని రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర తెలియ జేసారు. మాస్టర్ ప్లాన్ ముందు నుండే ఉంటే మరి ప్రజలకు మున్సిపల్ అధికారులు అధికారికంగా మోసపూరిత ప్లాన్ లు ఏవిదంగా ఇచ్చారో తెలపాలి అని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ లో రహదారిగా ఉన్న స్థలాలను వ్యాపారస్తులు ప్లాట్ లు వేసి అక్రమంగా అమ్ముకుంటుంటే చోద్యం చూస్తూ ఉన్న అధికారులు వ్యాపారస్తులకు కొమ్ము కాస్తూ మోసపూరితంగా రోడ్డు స్థలాలకు అధికారికంగా మున్సిపల్ ప్లాన్ లు సైతం ఇవ్వటం ఘోరమైన విషయం అని తెలియ జేసి, సైనికుల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి అని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి నీ కోరిన రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. అన్ని రికార్డులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమే అని నిర్ధారించుకొని, పై అధికారులకు విషయాన్ని తెలియ జేసి, న్యాయం చెయ్యడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని హామీ ఇచ్చినట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి, జనరల్ సెక్రెటరీ షేక్ మొయినుద్దీన్, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు, సీనియర్ మాజీ సైనికులు రుక్మదరరావు, బాదిత మాజీ సైనికులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News