Saturday, March 21, 2026

*గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎంసిసి-ఎంసిఎంసి సేవలను వినియోగించుకోవాలి** జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్—-*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి), మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసిఎంసి), అలాగే సహాయ కేంద్రం (కంట్రోల్ రూమ్)లను జిల్లా కలెక్టరేట్‌లో ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఫిర్యాదులు, వివాదాలు, ప్రచారం సంబంధించిన అంశాలు వంటి ప్రతీ సమాచారాన్ని ఈ కేంద్రాల ద్వారా వెంటనే నమోదు చేసి, అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు.ఎన్నికలకు సంబంధించిన ఏ సమస్యలైనా ఉన్నా లేదా సమాచారం అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ 9666234383 కి కాల్ చేసి సహాయాన్ని పొందవచ్చని కలెక్టర్ సూచించారు. 24×7 విధానంలో సిబ్బంది విధుల్లో ఉన్నారని, ప్రజలు మరియు అభ్యర్థులు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News