నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 05 ~అన్నమయ్య జిల్లా :-: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు శరావేగంగా మారిపోతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోగా కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కూటమి, నిధులు ఉన్న మేరకు అభివృద్ధి పనులపై ఫోకస్ చేసింది. అదే సమయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని అడిగి నిధులు తెచ్చుకుంటుంది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి భారీగానే కేంద్ర నిధులు వస్తున్నాయి. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం భారీ సహాయమే చేస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు రాహుల్ ప్రయత్నాలు చేస్తున్నారట. కూటమి అక్కడ తిరుగులేని శక్తిగా ఉంది. జగన్ ఒక్కడే కూటమిని ఎదుర్కోవడం కాస్త కష్టమవుతుందని కాస్త కూస్తో ఉన్న కాంగ్రెస్ ఓటు శాతం వైసీపీతో జతకడితే ఖచ్చితంగా విజయం వరిస్తుందనేది రాహుల్ గాంధీ మదిలో వున్న భావన. అందుకే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో రాహుల్ గాంధీ సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. వైయస్ జగన్ ఎక్కువ సమయం బెంగళూరులో గడుపుతుండగా అదే వేదికగా డీకే శివకుమార్ తో కలిసి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు రాహుల్ గాంధీ ఉరూతలుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను పక్కకు పెట్టి, మరొకరికి అధ్యక్ష పదవివ్వాలని కూడా రాహుల్ గాంధీ భావిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునేందుకు రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అదే జరిగితే వైసీపీ విజయం సాధించడం గ్యారంటీ అని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని చరిత్ర జగన్ కు ఒక్కరికే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటే అతనికి బ్యాడ్ నేమ్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అలా అని చూసుకుంటే ఒకవేళ మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే జగన్ మోహన్ రెడ్డి కెరీర్ కు ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఈ విషయాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళ్తారని చర్చ జరుగుతోంది. మరి ఎన్నికల సమయం వరకు ఏం జరుగుతుందో చూడాలి..~~~~~~~~~~~~~~~~~~





