నేటి సాక్షి (జిన్నారం) సిఐటియు అఖిలభారత మహాసభల ను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు వివిధ కంపెనీల దగ్గర సిఐటియు జెండాలను ఆవిష్కరణ చేయడం జరిగింది.కార్యక్రమం సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిన్నారం మండలంలోని టీఐడీసీ పరిశ్రమ మరియు డక్కన్ ఆటో పరిశ్రమ వద్ద జెండావిష్కరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, ప్రభాకర్, శేఖర్ ,శ్రీరాములు, డక్కన ఆటో యూనియన్ నాయకులు శ్రీనివాస్ ,నవీన్, తుకారం తదితరులు పాల్గొన్నారు.





