నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………..కాంగ్రెస్ సేవాదళ్ సెక్రటరీ బోగోజీ ముకేశ్ ఖన్నా గత కొన్ని రోజుల నుండి నాందేడ్ నుండి వయా జగిత్యాల మీదుగా అయ్యప్ప స్వాముల కొరకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలనీ,రైల్వే అధికారులకు, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ కి విన్నవించడం జరిగింది.మంత్రి వెంటనే స్పందించి దక్షిణ మధ్య రైల్వే gm తో మాట్లాడి ప్రత్యేక రైలు గూర్చి మాట్లాడటం జరిగింది.స్పందించిన రైల్వే అధికారులు విషయం రైల్వే శాఖ ఉన్నతాధికారులకు తెలపటం తో ప్రత్యేక రైలు ను ఏర్పాటు చేశారు.డిసెంబర్ 24,జనవరి 07తేది లలో నాందేడ్ నుండి కొల్లం వరకు, (శబరిమల )వెళ్లే స్వాముల కొరకు ప్రత్యేక రైలు అందుబాటులో ఉండనుంది.ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినందుకు అయ్యప్ప స్వాములు, భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.





