Wednesday, March 25, 2026

*వెటర్నరీ కళాశాలలో సౌకర్యాల పరిశీలన** విద్యార్థులతో సంభాషించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్—-*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం కోరుట్లలోని పీవీ నర్సింహారావు వెటర్నరీ & సైన్స్ కళాశాలను సందర్శించారు. పశువైద్య సేవలు, ల్యాబ్ సదుపాయాలు, చికిత్సా విధానాలు, ఆధునిక పరికరాల వినియోగం మొదలైన అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన ఆయన, వారి చదువు, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఫీల్డ్ అనుభవం, భవిష్యత్ లక్ష్యాలపై ఆరా తీశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుసంవర్ధక రంగం కీలకమని వివరించిన ఎమ్మెల్యే, నైపుణ్యాలను పెంపొందించుకొని సమాజానికి సేవ చేయాలని సూచించారు.*రైతులకు మేలు చేసే విధంగా వెటర్నరీ సేవలను బలోపేతం చేస్తాం*విద్యార్థులు నాణ్యమైన విద్య, విస్తృత ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు అవసరమైన సదుపాయాల అభివృద్ధిపై ఫ్యాకల్టీతో ఎమ్మెల్యే చర్చించారు. స్థానిక రైతులు, పశుపోషకులకు మరింత ఉపయుక్తంగా ఉండేలా వెటర్నరీ సేవలను బలోపేతం చేసే చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక రంగం పురోగతే తమ లక్ష్యమని, యువత భవిష్యత్తే తాము ముందుకు సాగడానికి ప్రేరణ అని ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు.—-

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News