Wednesday, March 25, 2026

*వేడుకగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం* ,

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం* మండలంలోని కమ్మ కండ్రిగ గ్రామంలో ఉన్న చేకూరి నాగమనాయుడు, ఎర్రమ్మల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ లో శుక్రవారం వేడుకగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, దాతలు పాల్గొన్న ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీడీవో రామ్ సింగ్ మాట్లాడుతూ విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంఈఓ 1 మార్కొండయ్య నాయుడు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు 100 రోజులు యాక్షన్ ప్లాన్ సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.సునీత మాట్లాడుతూ లక్ష్య సిద్ధి కోసం కృషి చేస్తూ అభ్యసన సామర్ధ్యాలను సాధన చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. పాఠశాల కమిటీ మాజీ చైర్మన్ బాదూరు బాలయ్య మాట్లాడుతూ విద్యా వికాసానికి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రగతి సాధించాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమైయే రీతిలో ఎంతో నైపుణ్యంతో మంచి విద్యను అందిస్తారన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాకర్ల వేణుగోపాల్ , పాఠశాల కమిటీ వైస్ చైర్మన్ హబీబూన్, దాతలు హనుమంత నాయుడు దామోదర్ నాయుడు, చంద్రశేఖర్ నాయుడు ,ఎస్.ఎల్.టి. ఏ జిల్లా అధ్యక్షులు దొడ్డ ఉమామహేశ్వర్, ఐ వెంకటరామయ్య. బ్రహ్మం,దిలీప్ కుమార్, శాంతి,విశ్వనాథం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News