నీటి సాక్షి (జిన్నారం)బొల్లారం మున్సిపల్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి, శుక్రవారం స్థానిక పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆనంద్ కృష్ణారెడ్డి, మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పగలనక, రాత్రనక ఎంతో కష్టపడుతూ, అప్పులు చేసి చదివిస్తున్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని కోరారు. వ్యసనాలు విడనాడాలి ముఖ్యంగా 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న విద్యార్థులు మత్తుపదార్థాలు మద్యం, డ్రగ్స్, వంటి ప్రమాదకరమైన దురలవాట్లకు బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దయచేసి, ఈ వ్యసనాల జోలికి పోవద్దు. ప్రేమ వలలో పడొద్దు విద్యార్థి దశలో, చదువుకోవాల్సిన ఈ ముఖ్యమైన సమయంలో, ప్రేమ పేరుతో పక్కదారి పట్టి, తమ చదువును, బంగారు భవిష్యత్తును పణంగా పెట్టకూడదు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు వారి జీవితాలనే కాక, తల్లిదండ్రుల కలలను కూడా చిద్రం చేస్తున్నాయి . తల్లిదండ్రుల ఆశ వమ్ము చేయకండి: “మీ తల్లిదండ్రులు మీపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. వారి ఆశలు నిరాశ చేయకుండా, చదువుపై దృష్టి పెట్టండి,” అని ఆయన భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు.తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి. చదువుకొని, మంచి జీవితాన్ని సాధించండి” అంటూ, శ్రీ ఆనంద్ కృష్ణారెడ్డి, రెండు చేతులు జోడించి నమస్కరించి విద్యార్థులకు విన్నవించుకున్నారు. యువత సరైన మార్గంలో నడవడానికి సమాజం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు.





