నేటి సాక్షి – ఇబ్రహీంపట్నం*ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు మెట్ పెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఓల కోసం నిర్వహించిన ఎలక్షన్ ట్రైనింగ్ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ట్రైనింగ్‌లో పాల్గొన్న పీఓలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలనే బాధ్యత పీఓలకు ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ‘పోలింగ్ డే’ రోజు అనుసరించాల్సిన విధివిధానాలు, పోలింగ్ స్టేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు సంబంధించిన అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. పోలింగ్ ఆఫీసర్లు ఎలక్షన్ డ్యూటీ అత్యంత బాధ్యతతో నిర్వహించాలని, ప్రతి పీఓ తమ పాత్రను సమర్థంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు.ఈ కార్యక్రమంలో మెట్ పెల్లి ఆర్డీవో శ్రీనివాస్, ఎమ్మార్వోలు, ఎంపిడివోలు, పి. వో లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు._____





