Monday, March 23, 2026

**జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ స్పోర్ట్ మీట్ ప్రారంభం**

నేటి సాక్షి – జగిత్యాల*శుక్రవారం రోజున స్థానిక వివేకానంద మినీ స్టేడియం లో జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ స్పోర్ట్ మీట్ జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీమతి బి. ఎస్ లత ప్రారంభించారు.జగిత్యాల జిల్లా లోని 16 పీఎం శ్రీ స్కూల్స్ నుండి సుమారు 900 మంది విద్యార్థులు కబడ్డీ,కోకో, వాలి బాల్ మరియు ఫుట్ బాల్ ఆటలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీమతి బి. ఎస్ లత మాట్లాడుతూ..ఆటలు ఆడడం ద్వార విద్యార్థులు ఆరోగ్యం గా ఉంటార ని,ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్థాయని తెలిపారు. జగిత్యాల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచి జిల్లా పేరును నిలబెడుతున్నారని ప్రశంసించారు. వ్యాయామ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ఆటల్లో ప్రావీణ్యం కనబరిచేలా మంచి తర్పీదు ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి కె.రాము, జిల్లా సెక్టారియల్ అధికారి కొక్కుల రాజేష్, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ చక్రధర్, పెటా అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ , పిడుగు భాస్కర్,కృష్ణ ప్రసాద్, అంజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.___

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News