నేటి సాక్షి,నారాయణపేట డిసెంబర్ 5, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రానికి చెందిన రైతు గాజుల నారాయణస్వామికి రైతు రత్న అవార్డు రావడం పట్ల ధన్వాడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతుల ఆధ్వర్యంలో శుక్రవారం శాలువలు పూలమాలలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన రైతులు తన్వాడ మండల కేంద్రానికి చెందిన జ్యోతి, సుధాకర్ రెడ్డి, లక్ష్మయ్య గౌడ్ నరేందర్ గౌడ్, రైమాన్ ఖాన్, జాకీర్ హుస్సేన్ అచ్చిబాబు అశోక్ చంద్రశేఖర్ గోపాల్ శ్రీశైలం, సకీరప్ప నాసర్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.





