నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) డిసెంబర్ 5*రామచంద్రపురం* మండలంలోని కుప్పం బాదూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి కృషి చేస్తానని సూక్ష్మచిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చినబాబు అన్నారు. శుక్రవారం కుప్పం బాదూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ క్రమంలోనే ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులు, రోజువారి వ్యాధిగ్రస్తుల నమోదు పై వైద్యాధికారులు తేజశ్వరి, పూర్ణ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి, అవసరమయ్యే మౌలిక వసతులు ఏర్పాటుకు తమ దృష్టికి తీసుకొస్తే తాను శక్తి వంచన లేకుండా అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వైద్య బృందం అతన్ని దుశాలవతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.





