నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) మద్యం అక్రమ కేసులో 171 రోజులుగా నిర్భంధంలో వున్న చెవిరెడ్డిపై అభిమానం చెక్కు చెదరడం లేదు. విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చినపుడల్లా వందలాది మంది నేతలు ఆయనను కళ్లారా చూడటానికి బస్సులు, రైళ్లు, కార్లులో పరుగెడుతున్నారు.. తమ అభిమాన నాయకుని పట్ల చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ఎండ గడుతూ తమ నాయకుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశిస్తున్నారు. అందులో భాగంగానే డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం ఉదయం 7గంటలకే విజయవాడ ఏసీబీ కోర్టు వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు, చెవిరెడ్డి అభిమానులు చేరుకుని కోర్టు వద్దకు వచ్చిన చెవిరెడ్డిని కలుసుకున్నారు. ఆ తరువాత ఆయన కుమారులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డిలకు అండగా నిలబడ్డారు.





