Monday, March 23, 2026

పుంగనూరు పరిధిలో ఘనంగా మూడో విడత మెగా పీటీఎం కార్యక్రమం..తల్లితండ్రుల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అలీమ్ భాష, కొండవీటి కాంతమ్మ, మున్సిపల్ కౌన్సిలర్ లు..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 05 ~అన్నమయ్య జిల్లా :-: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల్లో మూడో విడత మెగా పీటీఎం కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాష భగత్ సింగ్ కాలనీ, మేలుపట్ల పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, తల్లితండ్రుల ఆహ్వానం మేరకు మెగా పేరెంట్స్ సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే పట్టణ పరిధిలోని పదో వార్డు లో గల పాఠశాలలో కొండవీటి కాంతమ్మ మరియు ఆయా వార్డుల్లో మున్సిపల్ కౌన్సిలర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అన్ని పరీక్షలు ఒకే పుస్తకంలో రాసేలా మూల్యాంకన పుస్తకాలను తీసుకొచ్చారు. వాటితో పాటు హోలిస్టిక్‌ ప్రొగెస్‌ కార్డు, విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌కార్డులనూ మెగా పీటీఎం లో తల్లిదండ్రులకు అందించారు. తద్వారా వారివారి పిల్లల చదువులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకునే వీలుంటుందని విద్యాశాఖ అంటుందని తల్లితండ్రులకు అలీమ్ భాష తెలిపారు. విద్యార్థులు కూడా చదువులో ఆసక్తిని పెంచుకోవాలని, నూతన ప్రయోగాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాలలో ఏదైనా సమస్యలుంటే చెప్పాలని దాన్ని శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారం చేస్తానని అలీమ్ భాష తెలిపారు. విద్యార్థులకు ఆయా తరగతులకు సాధించాల్సిన సామర్థ్యాల ఆధారంగా నిర్వహించిన బేస్‌లైన్‌ పరీక్ష ఫలితాలు, వివరాలను ఉపాధ్యాయులు వెల్లడించారు. తమ పిల్లలు విద్యాపరంగా, ప్రవర్తన పరంగా ఏ స్థాయిలో ఉన్నారో, సమాజ అంశాలపై ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తల్లిదండ్రులు తెలుసుకునేందుకు విద్యార్థులతో నేరుగా మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకోవచ్చని ప్రధానోపాధ్యాయులు తెలిపారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News